
నూరు శతవిధం కాదల్!
నాగచైతన్య, తమన్నా జంటగా సుకుమార్ దర్శకత్వం వహించిన లవ్లీ ఎంటర్‌టైనర్ ‘హండ్రెడ్ పర్సంట్ లవ్’ తమిళంలో రీమేక్ కానుంది. ఈ చిత్రాన్ని సుకుమారే నిర్మించనుండటం విశేషం. సంగీతదర్శకుడిగా ప్రతిభ చాటుకుని, హీరోగా మారిన జీవీ ప్రకాశ్‌కుమార్ ఇందులో హీరో. చంద్రమౌళి దర్శకత్వం వహించనున్నారు. వంద శాతం ప్రేమ అంటే.. తమిళంలో నూరు శతవిధం కాదల్ అని అర్థం. మరి.. తమిళంలో ఈ టైటిలే పెడతారేమో?