
మూడు రోజుల్లో రూ. 20.45 కోట్ల కలెక్షన్లు
ముంబై: టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన 'ఎ ఫ్లయింగ్ జాట్' బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా వసూళ్లు రాబడుతోంది. మొదటి మూడు రోజుల్లో రూ. 20.45 కోట్లు కలెక్షన్లు వసూలు చేసింది. ఈ నెల 25న ఈ సినిమా విడుదలైంది. మొదటి రోజు రూ. 7.10 కోట్లు, రెండో రోజు రూ. 6 కోట్లు మూడో రోజు రూ. 7.35 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ఆదివారం వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేశారు.
'ఎ ఫ్లయింగ్ జాట్' ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం కావడంతో అనుకున్నస్థాయిలో ఆరంభ వసూళ్లు రాలేదు. రెమో ఫెర్నాండెజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించింది. కీలకపాత్రలో నాథన్ జోన్స్ నటించాడు.