బుర్ఖా నటికి చుక్కలు చూపించారు | Aahana Kumra slammed body-shamers with Latest Pic | Sakshi
Sakshi News home page

బుర్ఖా నటికి చుక్కలు చూపించారు

Published Fri, Sep 22 2017 12:56 PM | Last Updated on Fri, Sep 22 2017 2:12 PM

బుర్ఖా నటికి చుక్కలు చూపించారు

బుర్ఖా నటికి చుక్కలు చూపించారు

సాక్షి, సినిమా : నేటి తరం హీరోహీరోయిన్లు సోషల్‌ మీడియాలో ఎంత చురుకుగా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల దగ్గరి నుంచి వారి వారి వ్యక్తిగత విషయాల దాకా ప్రతీ అంశాన్ని ఫ్యాన్స్‌తో పంచేసుంటున్నారు. తాజాగా ఆ జాబితాలో బాలీవుడ్‌ నటి అహనా కుమ్రా కూడా చేరిపోయింది. 
 
వివాదాస్పద చిత్రంగా వార్తల్లో నిలిచిన లిప్‌స్టిక్‌ అండర్‌ మై బుర్ఖాలో అహనా నటించిన విషయం తెలిసిందే. చిత్రంలో ఆమె నటనకు గానూ విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియాలో నిర్వహిస్తున్న డార్విన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు అహనా హజరైంది. అక్కడ ఖాళీ సమయంలో సాగర తీరాన రంగు రంగుల బికినీలో సరదగా గడుపుతూ.. ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అంతే మొన్నటిదాకా కాస్త సన్నగా కనిపించిన ఆమె లావు అయ్యిందంటూ పలువురు కామెంట్లు చేశారు.
 
వర్కవుట్‌ చేయాలంటూ.. జిమ్‌కు వెళ్లాలంటూ... ఇలా పలువురు ఆమె ఫోటోకు బదులు ఇచ్చారు. అయితే అవి మరీ శ్రుతి మించినట్లు కనిపించటంతో స్పందించిన అహనా... మరో ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘ఈ లోకాన్ని మనం మార్చగలమా? లేక లోకమే మనల్ని మారుస్తుందా?’ అంటూ సందేశం ఉంచింది. ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్న అహనా, స్టార్ హీరో సరసన నటించే అవకాశం కూడా దక్కించుకున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement