ఆకాశవాణి.. ఇది కార్తికేయ బోణి | Aakashavani First Look Motion Teaser | Sakshi
Sakshi News home page

ఆకాశవాణి.. ఇది కార్తికేయ బోణి

Published Thu, Nov 22 2018 12:45 AM | Last Updated on Thu, Nov 22 2018 12:45 AM

Aakashavani First Look Motion Teaser - Sakshi

కార్తికేయ

ఆకాశవాణి.. పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పడంటే ఎఫ్‌ఎమ్, టీవీల్లో పాటలు వస్తున్నాయి కానీ ఒకప్పుడు పాటలంటే కేవలం రేడియోలో మాత్రమే వచ్చేవి. అంతలా ప్రాచుర్యం పొందిన ‘ఆకాశవాణి’ పేరుతో ఇప్పుడు ఓ సినిమా తెరకెక్కనుంది. ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. ఈ రోజు కార్తికేయ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రవిశేషాల్ని వెల్లడించారు. ‘షోయింగ్‌ బిజినెస్‌‘ అనే బేనర్‌పై తొలి ప్రయత్నంగా రాజమౌళి వద్ద దర్శకత్వ శాఖలో చేసిన అశ్విన్‌ గంగరాజును  దర్శకునిగా పరిచయం చేస్తూ కార్తికేయ ఈ సినిమా నిర్మించనున్నారు.

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి తనయుడు, సింగర్‌ కాలభైరవ ఈ సినిమాతో సంగీత దర్శకునిగా పరిచయం అవుతున్నారు. రచయిత సాయిమాధవ్‌ బుర్రా సంభాషణలు, సురేశ్‌ రగుతు సినిమాటోగ్రాఫర్‌గా, జాతీయ అవార్డ్‌ గ్రహీత శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటర్‌గా పనిచేయనున్నారు. ‘‘రేడియో బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించనున్న ఈ సినిమాలో అందరూ కొత్తవాళ్లు నటిస్తారు. పీరియాడిక్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. జనవరిలో షూటింగ్‌ ఆరంభించి, సమ్మర్‌లో రిలీజ్‌ చేయా లనుకుంటున్నాం’’ అని కార్తికేయ తెలిపారు. ఈ చిత్రానికి లైన్‌ ప్రొడ్యూసర్‌: శశాంక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement