ఆమిర్‌ఖాన్.. ఈ పేరు భారత చలన చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రత్యేకం. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. విభిన్నమైన కథలకు ప్రాధాన్యమిస్తూ పాత్రకోసం ప్రాణం పెట్టి పనిచేస్తాడు. సినిమాల్లోనే కాదు టెలివిజన్ తెరపై కూడా ‘సత్యమేవజయతే’ ప్రోగ్రామ్‌తో తన మార్క్‌ని చూపించాడు ఈ మిస్టర్ పర్‌ఫెక‌్షనిస్టు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆమిర్‌ఖాన్ సినీ కెరియర్‌పై సాక్షి.కమ్ అందిస్తున్న ప్రత్యేక కథనం
బాలీవుడ్ సినీ నిర్మాత తాహిర్ హుస్సేన్, జీనత్ హుస్సేన్ దంపతులకు 1965 మార్చి 14న జన్మించిన ఆమిర్ ఖాన్ అసలు పేరు మహమద్ ఆమిర్ హుస్సేన్ ఖాన్. ఆమిర్‌ఖాన్ కుటుంబంలోనే చాలామంది బాలీవుడ్ ప్రముఖులున్నారు. ఆమిర్‌ఖాన్ పెద్దనాన్న నాసిర్ హుస్సేన్ ప్రముఖ దర్శక నిర్మాత. చిన్నతనం నుంచే సినీ బ్యాంక్‌గ్రౌండ్ కావడంతో ఎనిమిదేళ్ల వయసులోనే చిత్రపరిశ్రమకు పరిచయమయ్యారు. తొలిసారిగా పెద్దనాన్న నాసిర్ దర్శకత్వంలో తీసిన యాదోంకి బరాత్ సినిమాలో అమిర్.. ఓ పాటలో కనిపించారు. 1988లో ఖయామత్ సే ఖయామత తక్ సినిమాతో హీరోగా మారాడు. దిల్, రాజా హిందుస్థానీ, సర్ఫరోష్ వంటి సినిమాలతో బాలీవుడ్ సినీరంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.
2001లో తన పేరు మీద సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించి లగాన్ సినిమాను నిర్మించి, హీరోగా నటించారు ఆమిర్. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ పాపులర్ చిత్రంగా పురస్కారం అందుకుంది. ఆ తరువాత 4 ఏళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న ఆమిర్ 2006లో ఫనా, రంగ్ దే బసంతీ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాతి సంవత్సరం తారే జమీన్ పర్ చిత్రంతో దర్శకుడిగా మారారు ఆమిర్. ఈ చిత్రానికి గానూ పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు.
గజిని, 3 ఇడియట్స్, ధూమ్ 3, పికె, దంగల్ వంటి సినిమాలతో కమర్షియల్ గానే కాక, విమర్శకుల ప్రశంసలు కూడా పొందారు ఆమిర్. 3 ఇడియట్స్ సినిమాలో ఆమిర్ ప్రతిభకు గాను పద్మశ్రీ పురస్కారం
లభించింది. 2016లో ప్రముఖ కుస్తీ క్రీడాకారుడు మహావీర్ సింగ్ ఫొగాట్, అతని కుమార్తెల జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన దంగల్ సినిమాలో నటించారు. ఈ సినిమా ఓవర్సిస్ మార్కెట్‌లోనూ
అద్భుతమైన వసూళ్లను రాబట్టింది ఈ ఏడాది కరీనా కపూర్, విజయ్‌సేతుపతితో కలిసి అమీర్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా విడుదలకు సిద్దమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment