
‘నేను ఆమీర్ ఖాన్ దంగల్ సినిమాకు ప్రచారం కల్పించడానికి అంబానీ ఇంటికి వెళ్లాను. కానీ, నా సినిమా కోసం ఆయన ఎప్పుడూ రాలేదు’ అని బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్.. ఆమీర్ ఖాన్‌పై కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం గురించి తనకు తెలీదని అంటున్నారు ఆమీర్. ఈ రోజు బాలీవుడ్ మిస్టర్ పర్ఫేక్షనిస్ట్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆమీర్. ఈ క్రమంలో ఓ విలేకరి కంగన చేసిన కామెంట్ గురించి ఆమీర్‌ను ప్రశ్నించారు.
అందుకు ఆయన సమాధానమిస్తూ.. ‘కంగన అలా అన్నదా.. నాకు తెలీదే. అయినా ఈ విషయం గురించి ఆమె నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. ఎప్పుడైనా తనని కలిస్తే దీని గురించి తప్పకుండా అడిగి తెలుసుకుంటాను’ అన్నారు. ప్రస్తుతం ‘ఫారెస్ట్ గంప్’ అనే హాలీవుడ్ చిత్రాన్ని ‘లాల్ సింగ్ చద్దా’ టైటిల్‌తో రీమేక్ చేయబోతున్నట్లు తెలిపారు. దాంతో పాటు తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతాన్ని కూడా తెరకెక్కించే క్రమంలో ఉన్నట్లు ఆమీర్ ఖాన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment