
'ఇక పాటలు పాడను.. నటిగా వస్తా'
లండన్: బ్రిటన్ ప్రముఖ సింగర్ మేఘన్ ట్రైనర్ కాసేపు మైక్ పక్కకు పెట్టి ఇక నటిగా మారుతుందట. యూత్ను ఉర్రూతలూరించే పాటలు పాడే ఈ యంగ్ సింగర్ ఇక తాను నటనా జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. బాస్ అనే ఆల్బంతో హిటల్ టాక్ తెచ్చుకున్న ఈ 22 ఏళ్ల సుందరి సింగర్ గా కన్నా తనకు నటిగా ఉండటమే ఆసక్తి ఎక్కువ అని చెప్పింది.
ఒక పాప్ స్టార్ గా ఉన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉరకలేస్తూ కనిపించే ఆమెకు నటిగా కాలేకపోయాననే బాధ ఏ మూలనో ఉండిపోయిందంట. అందుకే ఆ వైపు అడుగులు ప్రారంభించింది. అయితే, ఆమె పాప్ సింగర్ కావాడానికి ఎంతో శ్రమకూర్చి ఉండొచ్చుగానీ.. ఇప్పుడు నటిగా మారడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండబోదని పలువురు చెప్తున్నారు. నటన వైపు ఆమె అడుగులు వేస్తున్న తరుణంలో మాట్లాడుతూ'నా జీవితంలో నాకున్న పెద్ద డ్రీమ్ ఇప్పుడిక ప్రారంభంకాబోతుంది. త్వరలోనే నేను వెళ్లి యాక్టింగ్ స్కూల్లో చేరుతాను' అని ఆమె తెలిపింది.