Meghan Trainor
-
'ఇక పాటలు పాడను.. నటిగా వస్తా'
లండన్: బ్రిటన్ ప్రముఖ సింగర్ మేఘన్ ట్రైనర్ కాసేపు మైక్ పక్కకు పెట్టి ఇక నటిగా మారుతుందట. యూత్‌ను ఉర్రూతలూరించే పాటలు పాడే ఈ యంగ్ సింగర్ ఇక తాను నటనా జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. బాస్ అనే ఆల్బంతో హిటల్ టాక్ తెచ్చుకున్న ఈ 22 ఏళ్ల సుందరి సింగర్ గా కన్నా తనకు నటిగా ఉండటమే ఆసక్తి ఎక్కువ అని చెప్పింది. ఒక పాప్ స్టార్ గా ఉన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉరకలేస్తూ కనిపించే ఆమెకు నటిగా కాలేకపోయాననే బాధ ఏ మూలనో ఉండిపోయిందంట. అందుకే ఆ వైపు అడుగులు ప్రారంభించింది. అయితే, ఆమె పాప్ సింగర్ కావాడానికి ఎంతో శ్రమకూర్చి ఉండొచ్చుగానీ.. ఇప్పుడు నటిగా మారడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండబోదని పలువురు చెప్తున్నారు. నటన వైపు ఆమె అడుగులు వేస్తున్న తరుణంలో మాట్లాడుతూ'నా జీవితంలో నాకున్న పెద్ద డ్రీమ్ ఇప్పుడిక ప్రారంభంకాబోతుంది. త్వరలోనే నేను వెళ్లి యాక్టింగ్ స్కూల్లో చేరుతాను' అని ఆమె తెలిపింది. -
ఆమెపై నాకు 'వుమెన్ క్రష్' ఉంది!
హాలీవుడ్ సింగర్ మేఘన్ ట్రైనర్ అంటే తనకు చచ్చేంత ఇష్టమని, ఆమె పట్ల తనకు 'వుమెన్ క్రష్' (ఆకర్షణ) ఉందని బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా పేర్కొంది. బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ట్రైనర్‌తో దిగిన సెల్ఫీని ప్రియాంక తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. 'ఈ అమ్మాయి అంటే నాకు వుమెన్ క్రష్. మేఘన ట్రైనర్.. బిల్బోర్డ్ మ్యూజిక్ వేడుకలో నువ్వు చంపేశావు. నీకు మరింత బలం చేకూరాలి' అంటూ ఈ సెల్ఫీకి క్యాప్షన్ పెట్టింది. ఇందుకు ట్రైనర్ బదులిస్తూ.. 'థాంక్స్' చెప్పింది. ప్రస్తుతం 'బేవాచ్' సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రియాంక హాలీవుడ్‌లోనూ తన అదృష్టం పరీక్షించుకోవాలని భావిస్తోంది. 'క్వాంటికో' టీవీ షో ద్వారా ఇప్పటికే ఆమెకు హాలీవుడ్లో మంచి పేరు వచ్చింది. దీంతో ప్రస్తుతం హాలీవుడ్‌లోనే చక్కర్లు కొడుతున్న ఈ అమ్మడు బ్లూ కలర్ డ్రెస్‌లో స్టన్నింగ్ లుక్‌తో బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డుల వేడుకకు హాజరైంది. ఈ కార్యక్రమంలో వీరిద్దరితోపాటు రిహానా, కేషా, బ్రిట్నీ స్పియర్ తదితరులు పాల్గొన్నారు. Give it up for @priyankachopra and @Serayah who are here to welcome @Meghan_Trainor to the stage! #BBMAs https://t.co/cYobLTq6En — BillboardMusicAwards (@BBMAs) May 23, 2016 -
'ఒంటరిగా ఉన్నా.. అబ్బాయిలను లైన్లో పెట్టాలి'
లాస్ ఏంజిల్స్: ప్రతిభ ఉంది. పేరు ప్రఖ్యాతలూ ఉన్నాయి. కావాల్సినంత డబ్బూ ఉంది. అయినా తాను ఇప్పటికీ ఓ తోడులేక ఒంటరిగా ఎందుకు ఉన్నానో అర్థం కావడం లేదు అంటోంది హాలీవుడ్ సింగర్ మేఘన్ ట్రైనర్. తాను ప్రేమలో పడేందుకు సిద్ధంగా ఉన్నా.. తన దగ్గరికి వచ్చేందుకు అబ్బాయిలు తెగ భయపడిపోతున్నారని ఈ 22 ఏళ్ల అమ్మడు వాపోతున్నది. 'నాకు ఇప్పటికీ ఓ తోడు దొరకలేదు. నేను అంతగా వెలుగులోకి రాకముందు నన్ను అబ్బాయిలు చూసేవారు. ఎప్పుడూ నా చుట్టూ తిరిగేవారు. నన్ను ఆకర్షించేందుకు ప్రయత్నించేవారు. కానీ నేను ఫేమస్ అయిన తర్వాత అబ్బాయిలు నన్ను చూడటమే మానేశారు. ఒకవేళ చూసినా భయపడుతున్నారు. ఇది కష్టంగా ఉంది. నేనేమైనా వికారంగా ఉన్నానా? నేను అందంగా లేనా? అన్న భావన కలుగుతోంది. కానీ నేను సూపర్ కూల్‌గా చాలా అందంగా ఉంటాను. నేను మంచి డ్రెస్‌లు వేయలేదు. ఇకముందు అబ్బాయిలను లైన్లో పెట్టాలి' అని ఈ భామ పేర్కొన్నట్టు 'పీపుల్' మ్యాగజీన్ తెలిపింది. హాలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియో లాంటి వ్యక్తితో డేటింగ్ ఇష్టపడతానని, ఆయన నటనంటే తనకెంతో ఇష్టమని, ఆయనతో డేటింగ్ చేస్తే అమేజింగ్‌గా ఉంటుందని గ్రామీ అవార్డు గెలుచుకున్న ఈ సింగర్ చెప్పుకొచ్చింది.