
ఆమెపై నాకు 'వుమెన్ క్రష్' ఉంది!
హాలీవుడ్ సింగర్ మేఘన్ ట్రైనర్ అంటే తనకు చచ్చేంత ఇష్టమని, ఆమె పట్ల తనకు 'వుమెన్ క్రష్' (ఆకర్షణ) ఉందని బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా పేర్కొంది. బిల్‌బోర్డ్ మ్యూజిక్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ట్రైనర్‌తో దిగిన సెల్ఫీని ప్రియాంక తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
'ఈ అమ్మాయి అంటే నాకు వుమెన్ క్రష్. మేఘన ట్రైనర్.. బిల్‌బోర్డ్ మ్యూజిక్ వేడుకలో నువ్వు చంపేశావు. నీకు మరింత బలం చేకూరాలి' అంటూ ఈ సెల్ఫీకి క్యాప్షన్ పెట్టింది. ఇందుకు ట్రైనర్ బదులిస్తూ.. 'థాంక్స్' చెప్పింది. ప్రస్తుతం 'బేవాచ్' సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రియాంక హాలీవుడ్‌లోనూ తన అదృష్టం పరీక్షించుకోవాలని భావిస్తోంది. 'క్వాంటికో' టీవీ షో ద్వారా ఇప్పటికే ఆమెకు హాలీవుడ్‌లో మంచి పేరు వచ్చింది. దీంతో ప్రస్తుతం హాలీవుడ్‌లోనే చక్కర్లు కొడుతున్న ఈ అమ్మడు బ్లూ కలర్ డ్రెస్‌లో స్టన్నింగ్ లుక్‌తో బిల్‌బోర్డ్ మ్యూజిక్ అవార్డుల వేడుకకు హాజరైంది. ఈ కార్యక్రమంలో వీరిద్దరితోపాటు రిహానా, కేషా, బ్రిట్నీ స్పియర్ తదితరులు పాల్గొన్నారు.
Give it up for @priyankachopra and @Serayah who are here to welcome @Meghan_Trainor to the stage! #BBMAs https://t.co/cYobLTq6En
— BillboardMusicAwards (@BBMAs) May 23, 2016