నిర్మాతగా నాని | Actor Nani turn Producer | Sakshi
Sakshi News home page

నిర్మాతగా నాని

Published Tue, Sep 24 2013 2:05 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

నిర్మాతగా నాని - Sakshi

నిర్మాతగా నాని

హీరో నాని నిర్మాతగా మారారు. బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్ నిడిమోర్, కృష్ణ డీకే తెలుగులో ‘డిఫర్ దోపిడి’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా రషెస్ చూసిన నాని... సినిమా నచ్చడంతో ఈ చిత్ర నిర్మాణంలో తానూ భాగస్వామిగా చేరారు. 
 
 వరుణ్‌సందేశ్, సందీప్ కిషన్, నవీన్, రాకేష్, మెలనీ ఇందులో ప్రధాన పాత్రధారులు. సిరాజ్ కల్లా దర్శకుడు. నిర్మాణం తుది దశకు చేరుకున్న ఈ చిత్రం గురించి  రాజ్‌నిడిమోర్, కృష్ణ డీకే మాట్లాడుతూ -‘‘నాని ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. 
 
 అలాగే నాని వాయిస్ ఓవర్ కూడా అందిస్తుండటం విశేషం. న్యూయార్క్‌కి చెందిన లుకాస్ ఛాయాగ్రహణం, మహేష్‌శంకర్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. దేవ కట్టా ఇందులో పోషించిన ఏసీపీ కృష్ణమాచార్య పాత్ర సినిమాకే హైలైట్. ఈ నెల 27న పాటలను, అదే నెలలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement