బాలీవుడ్‌ నటుడు రాజన్‌ కన్నుమూత | Actor Ranjan Sehgal Deceased | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ నటుడు రాజన్‌ కన్నుమూత

Published Sun, Jul 12 2020 4:12 PM | Last Updated on Sun, Jul 12 2020 4:14 PM

Actor Ranjan Sehgal Deceased - Sakshi

చండీగఢ్‌ : బాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. సినీ, టీవీ నటుడు రాజన్‌ సెహగల్‌(36) శనివారం మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రాజన్‌.. చండీగఢ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అతని మృతిపై సినీ అండ్‌ టీవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(సీఐఎన్‌టీఏఏ) సోషల్‌ మీడియా వేదికగా నివాళి ఆర్పించింది. కాగా, 2010 నుంచి రాజన్‌ సీఐఎన్‌టీఏఏ సభ్యునిగా ఉన్నారు. (ఐశ్వర్య రాయ్, ఆరాధ్యలకు కరోనా పాజిటివ్)

ఐశ్వర్యరాయ్‌, రణదీప్ హుడా జంటగా నటించిన సరబ్జిత్‌ చిత్రంలో రాజన్‌ నటించారు. ఆ చిత్రంలో రవీంద్ర పాత్ర పోషించారు. సరబ్జిత్‌తోపాటుగా ఫోర్స్‌, కర్మ,  మహీ ఎన్‌ఆర్‌ఐ (పంజాబీ) చిత్రాల్లో కూడా రాజన్‌ తనదైన నటనతో మెప్పించారు. ఇక, బుల్లితెరపై క్రైమ్‌ పెట్రోల్‌, సావధాన్‌ ఇండియా, తుమ్‌ దేనా సాత్ మేరా.. వంటి కార్యక్రమాల్లో నటించారు.(నటుడు అజిత్‌ అలా అన్నారా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement