సినిమా: తన గురించి తప్పుగా ప్రచారం చేయకండి ప్లీజ్ అని అంటోంది నటి సోనా. కుశేలన్, కో వంటి పలు శృంగార పాత్రల్లోనూ, ప్రతి నాయకి పాత్రల్లోనూ నటించి సంచలన నటిగా ముద్రవేసుకున్న ఈ అమ్మడు ఆ మధ్య నిర్మాతగా మారి చిత్రం ప్రారంభించి ఆదిలోనే చేతులెత్తేసింది. దమ్ము కొట్టడం మానేశానని ఇటీవల ఒక స్టేట్‌మెంట్ ఇచ్చింది. తాజాగా మరోసారి చర్చల్లో నానుతోంది. ఒక మలయాళ చిత్రంలో శృంగారాత్మక పాత్రలో విచ్చలవిడిగా అందాలను గుమ్మరించడమే ఈ చర్చకు కారణం.అయితే తాను ఆ పాత్రలో అందాలను ఆరబోసినా, అందుకు కారణం ఉందని, అది చాలా మంచి పాత్ర అని ఈ జాణ చెప్పుకుంటోంది. నటి సోనా అందాలారబోసిన చిత్రం పచ్చమాంగా. మలయాళంలో తెరకెక్కిన చిత్రం ఇది. దీని ట్రైలర్ ఇటీవల విడుదలైంది. అందులో నటి సోనా శృంగార రస నటన గురించి సామాజిక మాధ్యమాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి.
దీంతో నటి సోనా వాటికి వివరణ ఇచ్చే విధంగా ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో పచ్చమాంగా ఒక బలమైన కథాంశంతో కూడిందని చెప్పింది. బాలుమహేంద్ర చిత్రాల మాదిరి పక్కా క్లాసైన చిత్రం అని చెప్పింది. ఆ చిత్ర ట్రైలర్‌లో తన తాను ధరించిన దుస్తులు, కొద్ది పాటి సన్నివేశాలను చూసి శృంగార భరిత పాత్రలో నటించినట్లు భ్రమను కలిగిస్తున్నారని అంది. అది నిజం కాదని చెప్పింది. కేరళలో మహిళలు ఎలా దుస్తులు ధరిస్తారో అలానే సహజంగా ఉండాలని అలాంటి దుస్తులు ధరించినట్లు చెప్పింది. తాను ధరించిన దుస్తులను బట్టి అది గ్లామరస్ కథా చిత్రం అనో, తనను శృంగార నటి అనో చిత్రీకరించరాదని అభ్యర్థిస్తున్నానని చెప్పింది. పచ్చమాంగ అన్నది చాలా మంచి కథా చిత్రం అని చెప్పింది. తన కథా పాత్ర కూడా బలమైనదని అంది. చిత్రం విడుదలైన తరువాత ఈ విషయం అందరికీ అర్థం అవుతుందని నటి సోనా పేర్కొంది. ఇందులో నటుడు ప్రతాప్‌పోతన్ కూడా నటించారని, మరి ఆయన్నేమంటారని ఈ అమ్మడు ప్రశ్నస్తోంది.
తప్పుగా ప్రచారం చేయకండి ప్లీజ్
Published Fri, Jan 24 2020 10:05 AM | Last Updated on Fri, Jan 24 2020 10:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment