సినిమా: హాలీవుడ్ శృంగార నటి సన్నీలియోన్ బాలీవుడ్, కోలీవుడ్ అంటూ తన గ్లామరస్ నటనతో కర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె బాటలోనే మియారాయ్‌లియోన్ కోలీవుడ్‌కు దిగుమతి అయ్యింది. ఈమె సన్నిలియోన్‌కి సహోదరి అవుతుంది. అంతే కాదు ఈమె (ఐరోపా)లో టాప్‌మోస్ట్ శృంగార తారగా రాణిస్తోంది. ఈ అమ్మడిప్పుడు ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది.
నటుడు విమల్, ఆశ్నాజవేరి జంటగా నటిస్తున్న చిత్రం ఇవనుక్కు ఎంగేయో మచ్చమ్ ఇరుక్కు. ఆనందరాజ్, మన్సూర్‌అలీఖాన్, సింగంపులి ముఖ్య పాత్రలను షోషిస్తున్న ఇందులో నటి పూర్ణ పోలీస్‌అధికారిగా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఏఆర్.ముఖేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చార్మిళ మాండ్రే నిర్మిస్తున్నారు. ఇందులో మియారాయ్ లియోన్ మరో ముఖ్య పాత్రలో నటించిందినిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు 7న తెరపైకి రానుంది. గోపీజగదీశన్ ఛాయాగ్రహణను, నటరాజన్ శంకరన్ సంగీతాన్ని అందించారు.
Comments
Please login to add a commentAdd a comment