కమలహాసన్‌కు జంటగా మీనా | after long gap meena going to act with kamal haasan | Sakshi
Sakshi News home page

కమలహాసన్‌కు జంటగా మీనా

Published Fri, Jan 3 2014 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM

కమలహాసన్‌కు జంటగా మీనా

కమలహాసన్‌కు జంటగా మీనా

ప్రముఖ నటుడు కమలహాసన్‌తో నటి మీనా మరోసారి జతకట్టనుందా? కమలహాసన్, మీనా హిట్ పెయిర్‌గా ముద్ర ఉంది. వీరిద్దరూ కలసి ఇంతకుముందు అవ్వై షణ్ముగి చిత్రంలో నటించారు. ఈ చిత్రం భామ సత్యభామ పేరుతో తెలుగులోనూ  మంచి విజయాన్ని సాధించింది. ఈ జంటను మరోసారి తెరపై కలపడానికి ప్రయత్నాలు మొదలైనట్లు సమాచారం. మలయాళంలో మోహన్‌లాల్, మీనా కలిసి నటించిన దృశ్యం చిత్రం ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ చిత్రాన్ని ఇప్పుడు తమిళంలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 
 
 మలయాళంలో మోహన్‌లాల్ పోషించిన పాత్రను తమిళంలో కమలహాసన్‌ను నటింప చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. మీనా పాత్రకు ఆమెనే ఎంపిక చేయనున్నారట. ఇక కమల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి ఈ చిత్రం సెట్‌కు వెళుతుందంటున్నారు. అయితే ప్రస్తుతం విశ్వరూపం-2 చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాల్లో తలమునకలై వున్న కమల్ తదుపరి కన్నడ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో దర్శక, నిర్మాత లింగుస్వామి నిర్మించనున్న ఉత్తమ విలన్ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఆ తరువాత ‘దృశ్యం’లో నటించవచ్చని కోలీవుడ్ టాక్. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement