తనుశ్రీ దత్తా - నానా పటేకర్ వివాదంతో రాజుకున్న మీటూ ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బాధితురాల్లు ఒక్కొక్కొరు బయటకు వస్తున్నారు. ఇప్పటికే ఈ ఉద్యమానికి సోనమ్ కపూర్, స్వరా భాస్కర్, ట్వింకిల్ ఖన్నా, ప్రియాంక చోప్రా వంటి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పడు వీరి కోవలోకి ఐశ్వర్య రాయ్ చేరారు. ఈ విషయం గురించి ఐశ్ మాట్లాడుతూ.. ‘నేను ఇలాంటి విషయాల గురించి ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాను. గతంలో మాట్లాడాను.. ఇప్పుడు మాట్లాడుతున్నాను.. ఇక మీదట మాట్లాడతాను’ అని తెలిపారు.
ఈ సందర్భంగా ఐశ్ సోషల్ మీడియాకు కృతజ్ఞతలు చెప్పారు. ‘ఈ రోజు ప్రపంచంలో ఏ మూలన ఉన్న మహిళైనా సరే ఇక్కడ(సోషల్ మీడియాలో) తన బాధను చెప్పుకోవచ్చు. ప్రపంచం ఆమె బాధను వింటుంది’ అన్నారు. అంతేకాక ఇలాంటి విషయాల గురించి బయటకు చెప్పడానికి సమయంతో పని లేదన్నారు. ‘కేవలం వారు చెప్పిన వాటిని వింటూ.. వారికి మద్దతిస్తూ.. సాయం చేస్తే చాలు. దానికి సమయంతో పని లేద’ని పేర్కొన్నారు. కొద్దిగా ఆలస్యంగానైనా సరే మన దేశంలో మీటూ ఉద్యమం రావడం నిజంగా చాలా మంచి పరిణామం అన్నారు.
బాధితులందరికి దేవుడు మనో బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఐశ్వర్యకు కూడా ఇలాంటి వేధింపులు తప్పలేదు. ఈ విషయం గురించి గతంలో ఐశ్వర్య రాయ్ ‘2002లో మేము బ్రేకప్ చెప్పుకున్న తర్వాత కూడా అతను నన్ను(సల్మాన్ ఖాన్) ప్రశాంతంగా ఉండనిచ్చేవాడు కాదు. అతను నా గురించి చెత్త వాగుడు వాగేవాడు. మే కలిసి ఉన్నప్పుడు కూడా అతను నన్ను శారీరకంగా హింసించేవాడు. అదృష్టం ఏంటంటే ఆ గాయాల వల్ల ఎటువంటి మచ్చలు ఏర్పడలేదు. అందువల్లే తరువాతి రోజు ఏం జరగనట్లే నా పని చూసుకునే దాన్ని’ అని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment