తెల్లజుట్టు.. సిక్స్ ప్యాక్.. నాన్ చాక్! | ajith latest look revealed in vivegam movie | Sakshi
Sakshi News home page

తెల్లజుట్టు.. సిక్స్ ప్యాక్.. నాన్ చాక్!

Apr 6 2017 11:03 AM | Updated on Sep 5 2017 8:07 AM

తెల్లజుట్టు.. సిక్స్ ప్యాక్.. నాన్ చాక్!

తెల్లజుట్టు.. సిక్స్ ప్యాక్.. నాన్ చాక్!

కండలు తిరిగిన బాడీ.. చేతిలో నాన్ చాక్.. మరోవైపు తెల్ల జుట్టు. ఈ మాత్రం చాలు ఈ హీరో ఎవరో తెలియాలంటే. ఇంకెవరు, తమిళ యాక్షన్ హీరో అజిత్ కుమార్.

కండలు తిరిగిన బాడీ.. చేతిలో నాన్ చాక్.. మరోవైపు తెల్ల జుట్టు. ఈ మాత్రం చాలు ఈ హీరో ఎవరో తెలియాలంటే. ఇంకెవరు, తమిళ యాక్షన్ హీరో అజిత్ కుమార్. చాలాకాలం తర్వాత మళ్లీ యాక్షన్ హీరోగా తెర మీదకు వస్తున్న అజిత్ రూపాన్ని వివేగం సినిమా దర్శకుడు సిరుతై శివ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఇప్పటికే యుద్ధవీరుడిగాను, బాంబుదాడిలో గాయపడ్డ సైనికుడిలా, మంచు కొండల్లో తుపాకులు పట్టుకుని ఇలా రకరకాల ఫొటోలు విడుదల చేసిన శివ.. తాజాగా మరో పోస్టర్‌ను కూడా విడుదల చేసి సినిమా మీద ప్రేక్షకులకు అంచనాలను మరింత పెంచేశాడు.

ఈ ఫొటోను అర్ధరాత్రి సమయంలో శివ విడుదల చేయగా, అప్పటినుంచి అజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆ ఫొటోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. దాంతో అది ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. తెల్లజుట్టుతో సిక్స్ ప్యాక్‌తో కనిపించే అజిత్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. తలా అజిత్ పుట్టినరోజైన మే 1వ తేదీన వివేగం సినిమా టీజర్ కూడా వస్తుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకుముందు వీరం, వేదలం లాంటి హిట్ సినిమాలు ఇచ్చిన శివతో అజిత్ తీస్తున్న మూడో సినిమా ఇది. ఇందులో అజిత్ ఒక ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, అక్షరా హాసన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో మెరుస్తాడు. ఆగస్టు 10న ఈ సినిమా విడుదల అవుతుందని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement