అజిత్
ఇద్దరూ ఇద్దరే. ఒకరు ప్రముఖ స్టైలిష్ దర్శకుడు గౌతం మీనన్. మరొకరు కోలీవుడ్ టాప్ స్టార్, యాక్షన్ హీరో అజిత్. సక్సెస్, ఫెయిల్యూర్లతో ఏమాత్రం సంబంధం లేకుండా ఎవర్‌గ్రీన్ మాస్, కమర్షియల్ ఇమేజ్ ఉన్న హీరో అజిత్. ఈ ఇద్దరి కాంబినేషన్లో చిత్రం అంటే భారీ స్థాయిలోనే అంచనాలు ఉంటాయి. దానికి తోడు ఈ మూవీలో అజిత్ మూడు భిన్నమైన పాత్రలు పోషిస్తున్నాడు. చాలామంది హీరోలు ద్విపాత్రాభినయం చేస్తుంటారు. మూడు పాత్రలు పోషించడం చాలా అరుదు. అజిత్ మూడు పాత్రలలో కనిపించి మెప్పించడానికి సిద్ధమయ్యాడు.
ఈ చిత్రంలో అజిత్ సరసన స్వీటీ అనుష్క, బ్యూటీ త్రిష హీరోయిన్స్గా కనిపించబోతున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమా ప్రారంభమైన సమయంలో అజిత్ తెల్లజుట్టుతో ఉన్న ఫొటోలు వచ్చాయి. ఆ తర్వాత మంగాత్తా, వీరం, ఆరంభం... చిత్రాల్లో స్టైల్లోనే సాల్ట్‌పెప్పర్‌తో ఓ ఫొటో విడుదలైంది. ఆ తర్వాత అజిత్ చాలా స్మార్ట్‌గా, యువకుడిలా నల్ల జుట్టుతో ఉన్న ఫొటోలు విడుదలయ్యాయి. అవి అభిమానులను ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడు నల్లజుట్టు, గడ్డంతో ఉన్న మాస్ ఫొటో తాజాగా విడుదలైంది. అది ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
గతంలో వచ్చిన 'దీనా' చిత్రంలో ఉన్నట్లు అజిత్ కనిపిస్తున్నారని ఆయన అభిమానులు చెబుతున్నారు. దీపావళికి ఈ చిత్రం ట్రైలర్, పాటలను విడుదల చేసే అవకాశముందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు "తలా 55 " అనే టైటిల్ ఖరారు చేసే అవకాశం ఉందని కోలీవుడ్ టాక్.
**