అజిత్‌కు షారూఖ్ సాయం
ప్రముఖ నటుడు అజిత్‌కు బాలీవుడ్ హీరో సా యం అందజేశారు. అదేం సాయం అనుకుంటున్నారా! వీరం చిత్రం తర్వాత దర్శకుడు గౌతం మీనన్ చిత్రంలో నటిస్తున్న అజిత్ ఇందుకోసం శరీర బరువు తగ్గించేందు కు ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకుని వ్యాయామం చేస్తున్నారు. అజిత్ కు వెన్నెముకలో సమస్య ఉన్నందున ఇష్టమొచ్చిన రీతిలో బరువులు ఎత్తేందుకు వీలులేదు.
ఇందుకోసం ప్రత్యేకం గా ఒక ట్రెయినర్ కోసం అన్వేషించారు. ఈ విషయం తెలుసుకున్న హిందీ నటుడు షారుఖ్ ఖాన్ తన ట్రెయినర్‌ను అజిత్ ఇంటికి పంపారు. ఈ ట్రెయినర్ అజిత్ ఇంట్లోనే ఉంటూ శిక్షణ అందిస్తున్నారు.