నాగ్ డైరెక్టర్‌తో అఖిల్ మూవీ ప్రారంభం
హైదరాబాద్: టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ రెండో సినిమా ప్రాజెక్ట్ మొదలైంది. తొలి సినిమా అఖిల్ నిరాశపరచడంతో కాస్త గ్యాప్ తీసుకున్న అఖిల్ రెండో మూవీ పట్టాలెక్కనుంది. నాగార్జునకు 'మనం' లాంటి సక్సెస్ అందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనంది. కొత్త ప్రాజెక్టును నాగార్జున, అమల ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు నాగార్జున. 'ఓపికకు తెరపడింది. అఖిల్ మూవీ ప్రారంభమైంది. పూజ చేసి ప్రాజెక్టు మొదలుపెట్టాం' అని ట్వీట్లో నాగ్ పేర్కొన్నారు.
అఖిల్ మూవీ సక్సెస్ కావాలని నాగార్జున ఆకాంక్షిస్తూ.. తనయుడు అఖిల్‌ను దీవించారు. అఖిల్ కెరీర్‌కు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి, మనం మూవీకి పనిచేసిన టెక్నీషియన్లు ఈ మూవీలో భాగస్వామ్యం కానున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌తో పాటు మనం ఎంటర్ ప్రైజెస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.
Patience always pays off!!puja done