అఖిల్ మూవీపై మరో ట్విస్ట్
అఖిల్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన క్యూట్ బాయ్ అఖిల్, తొలి సినిమాతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. డెబ్యూ సినిమాతోనే మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించి మెప్పించలేకపోయాడు. దీంతో రెండు సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తొలి చిత్రాన్ని అఖిల్ ఇష్టానికి వదిలేసిన నాగార్జున, రెండో సినిమా విషయంలో మాత్రం దగ్గరుండి అన్నీ చక్కబెడుతున్నాడు.
చాలా మంది దర్శకుల పేర్లను పరిశీలించి ఫైనల్గా మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమాను ఫైనల్ చేశాడు. చాలా రోజులు క్రితమే విక్రమ్ దర్శకత్వంలో అఖిల్ సినిమా అంటూ ఎనౌన్స్మెంట్ వచ్చినా.. ఇంత వరకు ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. త్వరలోనే అఖిల్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందన్న వార్తలు వినిపిస్తున్నా అది ఎప్పుడన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు.
అయితే తాజాగా అఖిల్ రెండో సినిమాపై ఆసక్తికరమైన వార్త ఒకటి వినిపిస్తోంది. దర్శకుడు విక్రమ్ ముందుగా అనుకున్న కథను పక్కన పెట్టేసి, ఇప్పుడు మరో కథను రెడీ చేసే పనిలో ఉన్నాడట. ముందుగా అనుకున్న లైన్ సెట్ కాకపోవటంతో ఇప్పుడు మరో కథను పక్కాగా ప్రీపేర్ చేస్తున్నారట. అందుకే జనవరిలోనే ప్రారంభం కావల్సిన సినిమాను ఫిబ్రవరికి వాయిదా వేశారన్న టాక్ వినిపిస్తోంది.