మైత్రి లేదు! | Akhil Akkineni spills the beans on the story of his second movie | Sakshi
Sakshi News home page

మైత్రి లేదు!

Published Fri, May 6 2016 12:27 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM

మైత్రి లేదు!

మైత్రి లేదు!

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ తెరంగేట్రం చేసిన ‘అఖిల్’ సినిమా వచ్చి ఆరు నెలలవుతోంది. మొదటి చిత్రం జయాపజయాల సంగతెలా ఉన్నా తనలో మంచి హీరో మెటీరియల్ ఉన్నాడని అఖిల్ నిరూపించుకున్నారు. ఇప్పుడు ఈ యువహీరో చేయనున్న రెండో సినిమాపై అందరి దృష్టీ ఉంది. ఈ చిత్రం ఏ బేనర్లో ఉంటుందనే చర్చ జరుగుతోంది.

మహేశ్‌బాబుతో ‘శ్రీమంతుడు’ వంటి సూపర్ హిట్ మూవీ నిర్మించి, ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ‘జనతా గ్యారేజ్’ నిర్మిస్తున్న ‘మైత్రి మూవీస్’  ఈ చిత్రాన్ని నిర్మించనుందనే టాక్ వినిపిస్తోంది. దీని గురించి అఖిల్ ట్విట్టర్  ద్వారా క్లారిఫికేషన్ ఇచ్చారు. ‘‘ఇలాంటి వార్తలు ఎక్కణ్ణుంచి వెబ్ మీడియా వాళ్లకి వస్తాయో అర్థం కావడం లేదు..

నా రెండవ చిత్రం ‘మైత్రి’ సంస్థలో చేస్తున్నాననడం అవాస్తవం. ఒక వార్తని ప్రజల్లోకి తీసుకెళ్లే  ముందు కన్‌ఫర్మ్ చేసుకుంటే బాగుంటుంది’’ అని పేర్కొన్నారు. రెండో చిత్రం ఎప్పుడు ఆరంభమవుతుందనే విషయం గురించి మాత్రం అఖిల్ క్లారిటీ ఇవ్వలేదు. దర్శకుడు  వంశీ పైడిపల్లి కథ రెడీ చేస్తున్నారట.  మరి.. ఎవరు నిర్మిస్తారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement