రూమర్స్పై స్పందించిన అఖిల్ | Akhil has rubbished the rumours through his twitter | Sakshi
Sakshi News home page

రూమర్స్పై స్పందించిన అఖిల్

Published Sat, May 14 2016 10:52 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

రూమర్స్పై స్పందించిన అఖిల్ - Sakshi

రూమర్స్పై స్పందించిన అఖిల్

తన రెండో సినిమా విషయంలో మీడియాలో వస్తున్న వార్తలపై అక్కినేని హ్యాండ్సమ్ హీరో అఖిల్ స్పందించాడు. అఖిల్ సినిమా డిజాస్టర్ కావటంతో తన రెండో సినిమా విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు ఈ సిసింద్రీ. ముఖ్యంగా తన ఏజ్కు తగ్గ కథ కోసం భారీ కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటి వరకు కథా, కథనాలు ఫైనల్ చేయకపోయినా త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళుతుందన్న టాక్ వినిపిస్తోంది.

నాగార్జున్తో ఊపిరి లాంటి బ్లాక్ బస్టర్ అందించిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అఖిల్ రెండో సినిమా ఉంటుందంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం పై అక్కినేని ఫ్యామిలీ మాత్రం ఇంతవరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. అదే సమయంలో వంశీ, అఖిల్ రెండో సినిమా నుంచి తప్పుకున్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది.

మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన అఖిల్ ట్విట్టర్లో తన నెక్ట్స్ సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తనకు మేనేజర్, పీఆర్ టీం ఉన్నాయన్న అఖిల్, మీడియా వార్తలు రాసే ముందు ఒకసారి వారిని సంప్రదించాలని కోరాడు. వంశీ పైడిపల్లితో కలిసి నెక్ట్స్ సినిమా కోసం వర్క్ చేస్తున్నట్టుగా చెప్పిన అఖిల్, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement