Akhil Next Movie Fix With Tholi Prema Director - Sakshi
Sakshi News home page

హలో.. నెక్ట్స్‌ మూవీ ఫిక్స్‌

Published Mon, Mar 19 2018 1:01 AM | Last Updated on Thu, Mar 22 2018 5:51 PM

Akhil Akkineni's next to be directed by Venky Atluri  - Sakshi

హలో! అఖిల్‌ నెక్ట్స్‌ సినిమా ఏంటి? ఎవరితో? ఎప్పుడు? అన్న ప్రశ్నలకు ఈ ఆదివారం ఉగాది రోజున సమాధానం దొరికింది. యస్‌.. అఖిల్‌ తర్వాతి చిత్రం ఖరారైంది. ‘తొలిప్రేమ’ ఫేమ్‌ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించనున్నారు. మేలో చిత్రీకరణ మొదలవుతుంది.

‘‘నా తర్వాతి చిత్రం గురించి ప్రకటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ అండ్‌ బాపినీడు నిర్మించనున్నారు. హ్యావ్‌ ఎ లవ్‌లీ సండే’’ అన్నారు అఖిల్‌. ‘‘మూవీ లవర్స్‌కి ఉగాది సర్‌ప్రైజ్‌ ఇది. త్వరలో ఈ సినిమా మరిన్ని వివరాలను వెల్లడిస్తాం’’ అన్నారు నిర్మాతలు. ‘‘అందరికీ ఉగాది శుభాకాంక్షలు’’ అన్నారు వెంకీ అట్లూరి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement