ముంబై : బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. కరోనాపై పోరులో అవిశ్రాంతంగా పనిచేస్తున్న ముంబై పోలీస్ ఫౌండేషన్‌కు తన వంతు సాయంగా 2 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై స్పందించిన ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బిర్ సింగ్ తన అధికారిక ట్విట్టర్‌లో అక్షయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ట్వీట్‌పై అక్షయ్ స్పందిస్తూ.. కరోనా కారణంగా మృతిచెందిన హెడ్ కానిస్టేబుల్స్ చంద్రకాంత్ పెండూర్కర్ మరియు సందీప్ సర్వేలకు నివాళులు అర్పించారు. మహమ్మారిపై పోరాటంలో పోలీసులు చేస్తున్న సేవలకు సలాం అని పేర్కొన్నారు. పోలీసుల వల్లే మనం ఇంకా సురక్షితంగా ఉన్నామని, ముంబై పోలిస్ ఫౌండేషన్‌కు తమ వంతు విరాళాలు ఇవ్వాల్సిందిగా అభిమానులను కోరారు.
I salute @MumbaiPolice headconstables Chandrakant Pendurkar & Sandip Surve, who laid their lives fighting Corona. I have done my duty, I hope you will too. Let’s not forget we are safe and alive because of them 🙏🏻 https://t.co/mgJyxCdbOP pic.twitter.com/nDymEdeEtT
— Akshay Kumar (@akshaykumar) April 27, 2020
గతంలోనూ ప్రధానమంత్రి సహాయనిధికి 25 కోట్లు, ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌కు 3 కోట్ల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ముంబై పోలీసులకు 2 కోట్ల విరాళం ప్రకటించి సూపర్‌స్టార్ అనిపించుకున్నారు. అక్షయ్ ఉదారతపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. (కరోనాపై పోరాటం: అక్షయ్ రూ.25 కోట్ల విరాళం )
Comments
Please login to add a commentAdd a comment