
సాక్షి, చెన్నై : సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. తమిళనాడుకు చెందిన ట్రాన్స్‌జెండర్లకు గృహ నిర్మాణం నిమిత్తం రూ. కోటిన్నర నగదును విరాళంగా ప్రకటించారు. ప్రముఖ నటుడు, దర్మకుడు రాఘవ లారెన్స్‌తో కలిసి ఆదివారం చెన్నైలో ట్రాన్స్‌జెండర్లకు చెక్కును బహుకరించారు. ఈ విషయాన్ని లారెన్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక గృహ నిర్మాణం కొరకు ఓ హీరో ఇంత పెద్దమొత్తంలో నగదును విరాళం ప్రకటించడం దేశంలో ఇదే తొలిసారి అని లారెన్స్ పేర్కొన్నారు.
కాగా అనాథ పిల్లల కోసం లారెన్స్ ఇదివరకే ఓ ట్రస్ట్‌కు కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీని ద్వారా ప్రతి ఏటా ఎంతో మందికి నివాసం కల్పిస్తూ.. వారి బాధ్యతలను చూసుకుంటున్నారు. ఇదిలావుండగా రాఘవ లారెన్స్ దర్మకత్వంలో విడుదలైనలక్ష్మీ బాంబ్ చిత్రంలో ట్రాన్స్‌జెండర్ పాత్రలో అక్షయ్ నటించి.. మెప్పించిన సంగతి తెలిసిందే.