'క్రాక్'గా అక్షయ్ కుమార్
బాలీవుడ్ రుస్తుం అక్షయ్ కుమార్ కొత్త సినిమా 'క్రాక్' ఫస్ట్ లుక్ రిలీజైంది. సోమవారం మధ్యాహ్నం సోషల్ మీడియాలో అక్షయ్ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవానికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. స్పెషల్ 26, బేబీ లాంటి సినిమాలను అందించిన నీరజ్ పాండే దర్శకత్వంలో మరోసారి నటించే అవకాశం వచ్చినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తన కొత్త చిత్రానికి అందరి ఆశీస్సులు, ప్రేమ కావాలంటూ టీజర్ పోస్టర్ను ఫేస్ బుక్లో పోస్ట్ చేశారు అక్షయ్.
ఆ పోస్టర్లో పగిలిపోయిన కళ్లజోడుతో పాటు ఆసక్తికర క్యాప్షన్ కూడా కనబడుతుంది. అక్షయ్ తాజా చిత్రం 'రుస్తుం' కలెక్షన్లతో దూసుకుపోతోంది. మూడు రోజుల్లో రూ.51 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. రుస్తుం సక్సెస్ సంబరంలో ఉన్న అభిమానులకు.. అక్షయ్ తదుపరి చిత్ర ఫస్ట్ లుక్ మరింత సంతోషాన్ని కలిగిస్తోంది.