అతని గురించి అడగొద్దు! | alia bhatt Secret Relationship Arjun Kapoor | Sakshi
Sakshi News home page

అతని గురించి అడగొద్దు!

Published Sat, Jan 10 2015 11:53 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

అతని గురించి అడగొద్దు! - Sakshi

అతని గురించి అడగొద్దు!

‘అడిగిన ప్రశ్నను పదే పదే అడిగితే ఎవరికైనా ఒళ్లు మండుతుంది. ఆ మంటలో పెడసరంగా జవాబు చెప్పామనుకోండి... తలపొగరు అంటారు’’ అని ఆలియా భట్ ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ బ్యూటీ ఆగ్రహానికి కారణం లేకపోలేదు. హీరో అర్జున్ కపూర్‌తో ఆలియా ప్రేమాయణం సాగిస్తున్నారనే వార్త ప్రచారంలో ఉంది. ఈ మధ్యకాలంలో ఆలియాను ఎవరు ఇంటర్వ్యూ చేసినా అందులో అర్జున్ గురించి ప్రశ్న ఉండటం పరిపాటి అయ్యింది. ఇకపై ఎవరైనా అర్జున్ గురించి అడిగితే ఊరుకునేది లేదంటున్నారు ఆలియా.

 అయినప్పటికీ ఓ బాలీవుడ్ విలేకరి ఊరుకోకుండా ‘మిమ్మల్ని ముద్దు పెట్టుకోవడం ఇష్టమని అర్జున్ అన్నారు కదా దానికి మీ స్పందన?’ అని అడిగారట. దానికి ఆలియా స్పందిస్తూ -‘‘ఈ మాటలు అన్నది ఆయ్జనే కదా. తనన్ని అడగకుండా నన్నడిగితే ఏం చెప్పగలను? ఇప్పుడు మీకు ఆలియాను ముద్దాడటం తనకిష్టం లేదని అర్జున్ చెప్పాలా? అతన్నుంచి ఆ సమాధానం వస్తే మీకు తృప్తిగా ఉంటుందా?’’ అని ఎదురు ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement