17 బ్యాంకులు.. 9000 కోట్లు.. ఒక కుచ్చుటోపీ.. సింపుల్ గా విజయ్ మాల్యా వ్యవహారం. పార్లమెంట్ నుంచి పానీపూరీ బండి వరకు ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్న హాట్ టాపిక్. ఎవరికి వారు విజయ్ మాల్యా గురించి వీలైనన్ని స్క్రిప్ట్ లు రాసే పనిలో బిజీగా ఉన్నారు. మాల్యా జంప్ జిలానీకి సంబంధించిన ప్రతి విషయం 'వార్త' అవుతున్న నేపధ్యంలో ఓ టాలీవుడ్ హీరో ఇటీవల ఆయనతో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
'బ్యాంకులకు దొరకని విజయ్ మాల్యా నా సెల్ఫీకి చిక్కాడు' అంటూ టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ శనివారం ఓ సెల్ఫీని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇండియాలోనే.. లేటెస్ట్ సెల్ఫీ అంటూ ట్వీట్ చేశారు. చూస్తుంటే ఎయిర్ పోర్టులో దిగిన ఫొటోలా ఉంది. ఏదేమైనా విజయ్ మాల్యా ఇప్పుడు సోషల్ మీడియాలో మోస్ట్ ట్రెండింగ్ పర్సనాలిటీ!
Bankulaku dorakani vijay malya naa selfie ki chikkadu. Enjoy his last selfie while in india! pic.twitter.com/4m0WEMqzlo
— Allari Naresh (@allarinaresh) March 12, 2016