విజయ్ మాల్యానీ వదల్లేదు.. | Ram Gopal Varma tweets about Vijay Mallya | Sakshi
Sakshi News home page

విజయ్ మాల్యానీ వదల్లేదు..

Published Sat, Mar 12 2016 7:21 PM | Last Updated on Sun, Sep 3 2017 7:35 PM

విజయ్ మాల్యానీ వదల్లేదు..

విజయ్ మాల్యానీ వదల్లేదు..

తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శక,నిర్మాత రామ్ గోపాల్ వర్మ.. తాజాగా లిక్కర్ కింగ్ విజయ్ మాల్యానూ వదల్లేదు. దాదాపు 9000 కోట్ల రూపాయలు బ్యాంకులకు బాకీ పడి కనిపించకుండాపోయిన విజయ్ మాల్యా వ్యవహారంపై తన స్టైల్లో సెటైర్లు వేశాడు రామూ.

విజయ్ మాల్యా తన వ్యక్తిగత బ్యాంకు నుంచి ఒక్కో బికినీ బ్యూటీని అప్పు తీసుకున్న బ్యాంకుకు ఇస్తే అతని రుణాలన్నీ తీరిపోతాయంటూ ట్విట్టర్లో ఘాటైన సలహా ఇచ్చాడు.  'బహుశా బ్యాంకులు విజయ్ మాల్యా 'బికినీ ప్రపోజల్'కు ఒప్పుకోకపోవచ్చేమోగానీ.. బ్యాంకర్లు ఒప్పుకుంటారు. అయినా అతని అప్పులు తీర్చేందుకు బికినీ భామలు చాలరా.. అహ జస్ట్ అడుగుతున్నానంతే' అంటూ రెచ్చిపోయాడు.

'విజయ్ మాల్యా రుణాలకు సంబంధించి బ్యాంకుల్లో సెక్యూరిటీ విషయంలో బికినీ భామలదే పెద్ద పాత్ర, అందుకే బ్యాంకర్లు ఫిర్యాదు చేయలేరు. మాల్యా కేలండర్ గాళ్స్ దీపికా పదుకొనే, నర్గీస్ ఫక్రి, ఇషా గుప్తా, కత్రినా కైఫ్ తదితరులు బ్యాంకర్లకు కంట్రిబ్యూట్ చేసే ఉంటారు. ఇదంతా చూస్తుంటే నాకేమనిపిస్తోందంటే.. బ్యాంకర్లకు బంగారు తళుకులు చూపించి వారి నుంచి వజ్రాలను ఎలా పొందాలో విజయ్ మాల్యాకు బాగా తెలుసు, సో.. తప్పిదం బ్యాంకులది కాదు, బ్యాంకర్లదే !' అంటూ ట్వీట్లతో మరోసారి సునామీ సృష్టించాడు రామ్ గోపాల్ వర్మ.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement