సౌత్లో ఆ ఘనత సాధించిన తొలి నటుడు | Allu Arjun crosses 1 crore likes on Facebook | Sakshi
Sakshi News home page

సౌత్లో ఆ ఘనత సాధించిన తొలి నటుడు

Published Fri, Feb 5 2016 4:52 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

సౌత్లో ఆ ఘనత సాధించిన తొలి నటుడు - Sakshi

సౌత్లో ఆ ఘనత సాధించిన తొలి నటుడు

యంగ్ హీరో అల్లు అర్జున్ మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే టాలీవుడ్తో పాటు కోలీవుడ్, మాలీవుడ్లలోనూ అభిమానులను సంపాధించుకున్న ఈ యంగ్ హీరో సోషల్...

యంగ్ హీరో అల్లు అర్జున్ మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే టాలీవుడ్తో పాటు కోలీవుడ్, మాలీవుడ్లలోనూ అభిమానులను సంపాదించుకున్న ఈ యంగ్ హీరో సోషల్ మీడియాలోనూ సత్తా చాటుతున్నాడు. ఫేస్బుక్లో రజనీ, కమల్ లాంటి నేషనల్ స్టార్స్కు కూడా అందని కోటి లైక్స్ సాధించి అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా తన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశాడు బన్నీ.

రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి వరుస సూపర్ హిట్స్తో మంచి ఫాంలో ఉన్న బన్నీ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాలో నటిస్తున్నాడు. రకుల్ ప్రీత్సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సమ్మర్లో రిలీజ్కు రెడీ అవుతున్న సరైనోడు బన్నీ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement