బన్ని భారీ ఫైట్‌.. ఖర్చెంతో తెలుసా? | Allu Arjuns Pushpa Telugu Movie Update Viral In Social Media | Sakshi
Sakshi News home page

భారీ యాక్షన్‌ సీన్‌.. హాలీవుడ్‌ రేంజ్‌లో

Published Sun, May 3 2020 8:29 PM | Last Updated on Sun, May 3 2020 8:29 PM

Allu Arjuns Pushpa Telugu Movie Update Viral In Social Media - Sakshi

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా క్రియేటివ్‌ హెడ్‌ సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా పుష్ప’ టీమ్‌ అంతా ఈ సమయాన్ని ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌కు బాగా వినియోగించుకుంటోంది. అయితే పాన్‌ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం సుక్కు అండ్‌ టీం భారీ ప్రణాళికలు రచిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఓ భారీ ఫైట్‌కు సుకుమార్‌ బృందం ప్లాన్‌ చేసిందట. 

హాలీవుడ్‌ రేంజ్‌లో ప్లాన్‌ చేసిన ఈ యాక్షన్‌ సీన్స్‌ కోసం హాలీవుడ్‌ ఫైట్‌ మాస్టర్లను రప్పించాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం అక్కడి నుంచి రావడం కుదరకపోవడంతో పీటర్‌ హెయిన్స్‌, కనల్‌ కన్నణ్‌లతో ఆ భారీ యాక్షన్‌ సీన్లను చిత్రీకరించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ యాక్షన్‌ సీన్‌ కోసం ఏకంగా రూ.6 కోట్ల కు పైనే ఖర్చుపెడుతున్నట్టు ఇండస్ట్రీ టాక్‌. ఇక లాక్‌డౌన్‌ తర్వాత గ్యాప్‌ లేకండా వేగంగా షూటింగ్‌ జరిపాలని సుకుమార్‌ భావిస్తున్నాడట. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు విశేష స్పందన వచ్చిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతమందిస్తున్నాడు. 

చదవండి:
పెళ్లిపై కామెంట్స్‌.. నచ్చావ్‌ సుబ్బరాజు
వార్నర్‌కు థ్యాంక్స్‌ చెప్పిన అల్లు అర్జున్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement