
అమలా పాల్ నటిస్తోన్న ఆదాయి చిత్రం ఫస్ట్ లుక్
అమలా పాల్ కథానాయకిగా నటిస్తున్న అ‘దో అంధ పరవాయి పోలా’ చిత్రం షూటింగ్ పూర్తి కావొచ్చినట్లు సమాచారం. ఈ సినిమా ఇంకా సెట్స్ మీద ఉండగానే అమలా హీరోయిన్‌గా మరో చిత‍్రం తెరకెక్కుతోంది. అమలా పాల్ ‘మేయాధా మన్’ ఫేం దర్శకుడు రత్న కుమార్ తెరకెక్కిస్తోన్న ‘ఆదాయి’ చిత్రంలో నటిస్నున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని హీరో రానా దగ్గుబాటి తన ట్విటర్ ద్వారా విడుదల చేశారు. థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం తన ఫస్ట్ లుక్‌తోనే ప్రేక్షకుల అంచనాలను విపరీతంగా పెంచేస్తోంది.
Here is the first look poster of Arrogant, Audacious and an artistic film “AADAI” Starring @Amala_ams directed by @MrRathna produced by @vstudiodoffl #AadaiFirstLook #AADAI pic.twitter.com/9pw6yD7Uwn
— Rana Daggubati (@RanaDaggubati) September 4, 2018
ఈ పోస్టోర్‌లో అమల పాల్ తన జీవితాన్ని కాపాడే ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తు ఉన్నారు. అంతేకాక పోస్టర్‌లో ఆమెని విపరీతంగా కొట్టినట్లు, రక్తం కారుతూ, చిరిగిన బట్టల్లో, హృదయవిదారకంగా ఏడుస్తూ ఉన్నారు. ఆర్టిస్టిక్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. దర్శకుడు రత్న కుమార్ గతేడాది ‘మేయాధా మన్’ చిత్రం ద్వారా తమిళ పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. ‘ఆదాయి’ ఈ దర్శకునికి రెండో చిత్రం.
Comments
Please login to add a commentAdd a comment