సేఫ్టీ లేదు | Amala Paul goes to police after being asked for sexual favours | Sakshi
Sakshi News home page

సేఫ్టీ లేదు

Published Fri, Feb 2 2018 12:17 AM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

Amala Paul goes to police after being asked for sexual favours - Sakshi

అమలా పాల్‌

ఈ మధ్య ఎక్కడ చూసినా మహిళల్ని వేధించటం, వారితో అసభ్యకరంగా ప్రవర్తించటం వంటి వార్తలు చూస్తూనే ఉన్నాం. సాధారణ మహిళల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరూ ఈ వేధింపులను తప్పించుకోలేకపోతున్నారు. అఫ్‌కోర్స్‌.. అందరికీ ఇలాంటి చేదు అనుభవాలు ఎదురు కావనుకోండి. ఆ సంగతలా ఉంచితే.. తాజాగా అమలా పాల్‌ ఓ చేదు అనుభవం ఎదుర్కొన్నారు. త్వరలో మలేసియాలో జరగబోయే ఓ ఈవెంట్‌ కోసం చెన్నైలోని టీ నగర్‌లో డ్యాన్స్‌ ప్రాక్టీస్‌లో పాల్గొంటున్నారు అమలాపాల్‌. ఆ డ్యాన్స్‌ స్టూడియోకి అలగేశన్‌ అనే వ్యక్తి వచ్చి అమలాపాల్‌ను కలిశారు. క్యాజువల్‌గా మాట్లాడటం మొదలుపెట్టాడట.

అయితే  కొద్దిసేపటి తర్వాత అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు అమలా పాల్‌.  వెంటనే అలగేశన్‌ను అదుపులోకి తీసుకున్నారు చెన్నై పోలీసులు. ‘‘మలేసియాలో ఓ బిజినెస్‌మేన్‌ నిర్వహించే ప్రైవేట్‌ పార్టీకి అమలాపాల్‌ను ఆహ్వానించడానికి వచ్చాను. ఇంతకు ముందు ఆమె మేనేజర్‌తో కూడా మాట్లాడాను’’ అని పోలీసులతో అలగేశన్‌ అన్నాడట. ఇదే విషయాన్ని అమలాపాల్‌ మేనేజర్‌ను సంప్రదించగా ‘అలగేశన్‌ ఎవరో తెలియదు’ అన్నాడట. ఈ విషయంపై అమలా పాల్‌  స్పందిస్తూ –‘‘అతని బిహేవియర్‌ చూసి షాక్‌ అయ్యాను. చాలా కించపరుస్తూ మాట్లాడాడు. ఈ విషయాన్ని పోలీసుల దగ్గరకు తీసుకువెళ్లటం మంచిదనిపించింది. వర్కింగ్‌ ఉమన్‌గా నాకు సేఫ్‌ అనిపించలేదు’’ అని పేర్కొన్నారు అమలాపాల్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement