హిందూ అబ్బాయితో లవ్‌ | Amala Paul returns to T’wood with a Hindu-Muslim love story | Sakshi
Sakshi News home page

హిందూ అబ్బాయితో లవ్‌

Mar 25 2017 11:54 PM | Updated on Sep 5 2017 7:04 AM

హిందూ అబ్బాయితో లవ్‌

హిందూ అబ్బాయితో లవ్‌

కళ్లు బాగున్నాయి... అమలా పాల్‌ కళ్లు ఎంతో బాగున్నాయి! ఆమె కళ్లలో ఏదో కనికట్టు ఉందంటున్నారు కొత్త దర్శకుడు చరణ్‌తేజ్‌.

కళ్లు బాగున్నాయి... అమలా పాల్‌ కళ్లు ఎంతో బాగున్నాయి! ఆమె కళ్లలో ఏదో కనికట్టు ఉందంటున్నారు కొత్త దర్శకుడు చరణ్‌తేజ్‌. అదేంటి? అమలా పాల్‌ కళ్లు గురించి అంతలా చెబుతున్నారేంటి అనుకుంటున్నారా! బురఖాలోని అమలా పాల్‌ కళ్లనే ఆయన ఎక్కువసేపు ఊహించుకుంటున్నారు. చరణ్‌తేజ్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించనున్న ‘ఆయుష్మాన్‌ భవ’లో అమలా పాల్‌ ముస్లిమ్‌ అమ్మాయి పాత్రలో నటించనున్నారు.

ఆల్మోస్ట్‌ రెండేళ్ల తర్వాత ఈ మలయాళీ కుట్టి సంతకం చేసిన స్ట్రయిట్‌ తెలుగు చిత్రమిది. ‘‘హిందూ అబ్బాయి, ముస్లిమ్‌ అమ్మాయి ప్రేమకథతో రూపొందనున్న ఈ సినిమాలో మధ్య తరగతి కుటుంబాల జీవితాలనూ ఆవిష్కరించనున్నాం. ఏప్రిల్‌ 15న చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు చరణ్‌తేజ్‌. ఈ సినిమాలో స్నేహా ఉల్లాల్‌ హీరో స్నేహితురాలి పాత్రలో నటిస్తారనీ, ఓ ప్రత్యేక గీతంలో కూడా సందడి చేస్తారనీ ఆయన తెలిపారు. అంతే కాదండోయ్‌... ప్రముఖ శృంగార తార సన్నీ లియోన్‌ చేత మరో ప్రత్యేక గీతం చేయించేందుకు చరణ్‌ తేజ్‌ చర్చలు జరుపుతున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement