
అమెరికా కుర్రాడి లవ్‌స్టోరీ!
‘అనామిక’ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరే చిత్రమూ రాలేదు. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టనున్నారు.
‘అనామిక’ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరే చిత్రమూ రాలేదు. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టనున్నారు. వరుణ్‌తేజ్ హీరోగా ఓ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది ‘‘ఒక అమెరికా అబ్బాయి, తెలంగాణా అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది’’ అని
నిర్మాత చెప్పారు.