కరణ్, అమితాబ్ ల 'బ్రహ్మాస్త్ర' | Amitabh Bachchan, Ranbir Kapoor, Alia Bhatt in karan johar Brahmastra | Sakshi
Sakshi News home page

కరణ్, అమితాబ్ ల 'బ్రహ్మాస్త్ర'

Published Wed, Oct 11 2017 5:38 PM | Last Updated on Mon, May 28 2018 3:50 PM

Amitabh Bachchan, Ranbir Kapoor, Alia Bhatt in karan johar Brahmastra - Sakshi

బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ ఓ భారీ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. బాహుబలి సినిమాకు బాలీవుడ్ ప్రచార కర్తగా వ్యవహరించిన కరణ్, ఇప్పుడు అదే స్థాయిలో ఓ ఫాంటసీ విజువల్ వండర్ ను బాలీవుడ్ తెరపై ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు. బ్రహ్మాస్త్ర పేరుతో తెరకెక్కుతున్న రూపొందించనున్న ఈ విజువల్ వండర్ లో అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, అలియా భట్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ లో మూడు భాగాలుగా నిర్మించనున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, నమిత్ మల్హోత్రాలు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా 2019 ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించాడు కరణ్.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement