డబుల్‌ షిఫ్ట్‌ | Alia Bhatt is currently working in multiple shifts | Sakshi
Sakshi News home page

డబుల్‌ షిఫ్ట్‌

Published Fri, Jun 8 2018 2:20 AM | Last Updated on Fri, Jun 8 2018 2:20 AM

Alia Bhatt is currently working in multiple shifts - Sakshi

ఆలియా భట్‌

డైరెక్టర్‌ ప్యాకప్‌ చెప్పారు. వెంటనే కారెక్కి లొకేషన్‌ నుంచి తుర్రుమన్నారు హీరోయిన్‌ ఆలియా భట్‌. ఇంటికి పోలేదు. షాపింగ్‌కి వెళ్లలేదు. మీరు ఊహిస్తున్నట్లు పార్టీలోనూ జాయిన్‌ అవ్వలేదు. డైరెక్ట్‌గా ఇంకో మూవీ లొకేషన్లోకి ‘ఐ యామ్‌ రెడీ’ అంటూ అడుగుపెట్టారు. అంటే... ఆలియా డబుల్‌ షిఫ్ట్‌ చేస్తున్నారు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో అమితాబ్‌ బచ్చన్, రణబీర్‌ కపూర్, ఆలియా భట్‌ ముఖ్య తారలుగా రూపొందుతోన్న సినిమా ‘బ్రహ్మాస్త్ర’. మార్నింగ్‌ ఈ సినిమా షూట్‌ను కంప్లీట్‌ చేసుకుని నెక్ట్స్‌ ‘కళంక్‌’ మూవీ సెట్‌లో జాయిన్‌ అయ్యారు.

అభిషేక్‌ వర్మన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న మల్టీస్టారర్‌ మూవీ ఇది. ఇందులో సంజయ్‌దత్, మాధురీ దీక్షిత్, సోనాక్షీ సిన్హా, ఆలియా భట్, వరుణ్‌ ధావన్, అదిత్యారాయ్‌ కపూర్‌ ముఖ్య తారలుగా నటిస్తున్నారు. గురువారంతో ఆలియా ఈ సినిమా సెట్‌లోకి అడుగుపెట్టి 20 రోజులైంది. ‘బ్రహ్మాస్త్ర’, ‘కళంక్‌’ చిత్రాలు వచ్చే ఏడాది రిలీజ్‌ కానున్నాయి. అందుకే రెండు సినిమాలకు డేట్స్‌ ఇచ్చేసి, మార్నింగ్‌ ఒక లొకేషన్‌తో ఈవెనింగ్‌ ఇంకో లొకేషన్‌కి మారుతూ ఆలియా బిజీ బిజీగా ఉంటున్నారు.  మరోవైపు రణబీర్‌ కపూర్‌తో ఆలియా భట్‌ డేటింగ్‌ చేస్తోందన్న వార్తలు బీటౌన్‌లో  హాట్‌టాపిక్‌గా మారాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement