మళ్లీ బాల్కీ దర్శకత్వంలో... | Amitabh Bachchan's YRF film not a Dhoom franchise | Sakshi
Sakshi News home page

మళ్లీ బాల్కీ దర్శకత్వంలో...

Published Mon, May 30 2016 10:39 PM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM

మళ్లీ బాల్కీ దర్శకత్వంలో...

మళ్లీ బాల్కీ దర్శకత్వంలో...

‘చీనీకమ్’, ‘పా’, ‘షమితాబ్’... ఈ మూడు చిత్రాలూ వేటికవి విభిన్నంగా ఉంటాయి. అలాగే, అమితాబ్ బచ్చన్‌ని కొత్తగా ఆవిష్కరించిన చిత్రాలివి. ‘చీనీకమ్’, ‘పా’ మంచి ఫలితాన్ని సాధించాయి. ‘షమితాబ్’ ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా అమితాబ్ వెరైటీ గెటప్‌లో కనిపించారు. ఈ మూడు  చిత్రాలకూ బాల్కీ దర్శకుడు. ఆయనతో అమితాబ్‌కి మంచి అనుబంధం ఉంది. మంచి కథలతో సినిమాలు తీస్తారనే నమ్మకం కూడా ఏర్పడింది.

అందుకే బాల్కీ దర్శకత్వంలో నాలుగో చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈసారి ఈ కాంబినేషన్ నుంచి ఎలాంటి వెరైటీ మూవీ వస్తుందో చూడాలి. ఈ చిత్రం కాకుండా తొమ్మిదేళ్ల తర్వాత యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థలో అమితాబ్ ఓ సినిమా చేయనున్నారు. ఇది ‘ధూమ్-4’ అనే వార్త షికారు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇది ‘ధూమ్’ సిరీస్ కాదనీ వేరే చిత్రమనీ అమితాబ్ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement