‘ఆనందో బ్రహ్మ’ అదరగొడుతోంది
హైదరాబాద్: తాప్సి ప్రధానపాత్రలో నటించిన ‘ఆనందో బ్రహ్మ’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 17 కోట్ల వారాంతపు కలెక్షన్లు సాధించింది. మొదటి రోజున రూ. 5 కోట్లు, రెండు రోజు రూ.5.5 కోట్లు, రూ. 6.5 కోట్ల వసూళ్లు తెచ్చుకుంది. మనుషులను చూసి దెయ్యం భయపడితే? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. సానుకూల సమీక్షలకు మౌత్ పబ్లిసిటీ తోడవటంతో నిలకడగా కలెక్షన్లు సాధిస్తోంది.
తక్కువ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా బయ్యర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో 70 ఎం.ఎం. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చల్లా, శశిదేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ‘వెన్నెల’ కిశోర్, తాగుబోతు రమేశ్, ‘షకలక’ శంకర్ ముఖ్య పాత్రల్లో నటించారు. హీరో సుధీర్‌బాబు అతిథి పాత్రలో మెరిశారు.