ఎన్టీఆర్పై 'అనంత' అభిమానం | ananthapur fans costly gift to ntr | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్పై 'అనంత' అభిమానం

Published Wed, Oct 7 2015 9:54 AM | Last Updated on Sun, Sep 3 2017 10:35 AM

ఎన్టీఆర్పై 'అనంత' అభిమానం

ఎన్టీఆర్పై 'అనంత' అభిమానం

మూడు నెలల భారీ షెడ్యూల్ తరువాత ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్న ఎన్టీఆర్కు అభిమానులు భారీ గిఫ్ట్ ఇచ్చారు. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి వచ్చిన నందమూరి అభిమానులు, ఎన్టీఆర్ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా బంగారు జరీతో నేసిన పట్టు వస్త్రాన్ని ఎన్టీఆర్కు అందజేశారు.

ఈ పట్టు చీరలో మరో విశేషం కూడా ఉంది. ఈ వస్త్రం పై నందమూరి తారాక రామారావు, బసవతారకంల చిత్రపటాలు వచ్చే విధంగా నేసిని బంగారు జరీ చీర ఇది. ఈ చీర కోసం 35 లక్షలకు పైగా ఖర్చు చేసినట్టుగా అభిమానులు తెలిపారు. తన పై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలియజేశాడు.

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్,  ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో అలరించనున్నాడు. లండన్లో జరిగిన భారీ షెడ్యూల్ తరువాత బ్రేక్ తీసుకున్న ఎన్టీఆర్ ఈ నెల 24 నుంచి స్పెయిన్లో మరో షెడ్యూల్కు రెడీ అవుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement