
పాలిటిక్స్ ప్రేమకథ
ఏమో.. నాకన్నీ అలా తెలిసిపోతాయంతే! అంటూ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో అమాయకంగా మాట్లాడిన అంజలి, ‘గీతాంజలి’లో ప్రేక్షకులను భయపెట్టారు. ఇప్పుడేమో యువరానర్ అంటున్నారు. విమల్, అంజలి జంటగా రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఓ తమిళ చిత్రాన్ని సత్యదేవ పిక్చర్స్ పతాకంపై రావిపాటి సత్యనారాయణ ‘అల్లుడు సింగం’గా తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘రాజకీయ నేపథ్యంలో సాగే ప్రేమకథ. అంజలి లాయర్‌గా, పొలిటీషియన్‌గా కనిపిస్తారు. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేయాలను కుంటున్నాం’’ అన్నారు.