పవన్, బన్నీ తరువాత ఎన్టీఆర్..! | Anu Emmanuel is heroine for NTR Trivikram Film | Sakshi
Sakshi News home page

పవన్, బన్నీ తరువాత ఎన్టీఆర్..!

Published Wed, Aug 23 2017 12:23 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్, బన్నీ తరువాత ఎన్టీఆర్..! - Sakshi

పవన్, బన్నీ తరువాత ఎన్టీఆర్..!

నాని హీరోగా తెరకెక్కిన మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అమెరికన్ బ్యూటీ అను ఇమ్మాన్యూల్. తొలి సినిమాతోనే హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ తరువాత రాజ్ తరుణ్ సరసన కిట్టూ ఉన్నాడు జాగ్రత్త సినిమాలో నటించింది. ఇద్దరు యంగ్ హీరోల సినిమాలతో ఆకట్టుకున్నా ఈ బ్యూటీ మూడో సినిమాతోనే ఏకంగా పవర్ స్టార్తో జోడి కట్టే ఛాన్స్ కొట్టేసింది.

పవన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో కీర్తి సురేష్తో పాటు అను ఇమ్మాన్యూల్ కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో క్రేజీ ఆఫర్ను సొంతం చేసుకుందన్న టాక్ వినిపిస్తోంది. బన్నీతో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలోనూ నటిస్తున్న ఈ భామను.. త్రివిక్రమ్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించబోయే సినిమాకు కూడా హీరోయిన్ గా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట. అయితే ఈ సినిమాలో అనునే లీడ్ హీరోయినా.. లేక మరో హీరోయిన్ ఉంటుందా అన్న విషయం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement