హాలీవుడ్ యవనికపై వెలుగుతారా? | anushka and Nayanthara Competite for Hollywood Films | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ యవనికపై వెలుగుతారా?

Published Tue, Aug 12 2014 10:53 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

హాలీవుడ్ యవనికపై వెలుగుతారా? - Sakshi

హాలీవుడ్ యవనికపై వెలుగుతారా?

 బాలీవుడ్ అవకాశం వస్తేనే ఎగిరి గంతేస్తుంటారు మన కథానాయికలు. కానీ... అనుష్క, నయనతారలకు ఏకంగా హాలీవుడ్ ఛాన్సే దక్కేట్టు కనిపిస్తోంది. త్వరలో ఈ ముద్దుగుమ్మలిద్దరూ ఓ భారీ హాలీవుడ్ సినిమాలో నటించే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయనేది చెన్నయ్ టాక్. వివరాల్లోకెళ్తే... సిల్వెర్‌స్టర్ స్టాలోన్, స్క్రిప్టు సమకూర్చిన హాలీవుడ్ టాప్ యాక్షన్ హీరో ‘ది ఎక్స్‌పెండబుల్స్’ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులరో తెలిసిందే. ఇప్పుడు నెక్ట్స్ సిరీస్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి.
 
 ఇప్పటివరకూ వచ్చిన సిరీస్‌ని తలదన్నేలా ఈ చిత్రాన్ని నిర్మించి, వ్యాపార పరంగా కూడా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగానే మన దేశానికి సంబంధించిన కథానాయికల వైపు దృష్టి సారించారు. కథానుగుణంగా ఇందులో ఏడుగురు కథానాయికలు ఉంటారు. ఏడూ విభిన్న పాత్రలే. ఈ పాత్రలు పోరాటాలు, సాహసాలు చేయాలి. ఈ ఏడు పాత్రల్లో.. మూడు పాత్రలకు దక్షిణాది కథానాయికలను తీసుకోవాలని హాలీవుడ్ నిర్మాణ సారథులు భావిస్తున్నారట.
 
 త్వరలో ముంబై, చెన్నైల్లో కథానాయికల ఆడిషన్ టెస్ట్ నిర్వహించనున్నారు. దక్షిణాది నుంచి నయనతార, అనుష్క, లక్ష్మీరాయ్, నీతూచంద్ర పోటీపడుతున్నట్లు సమాచారం. అయితే.. వీరిలో నయన, అనుష్కలకే ఎక్కువ అవకాశాలున్నాయనేది చెన్నయ్ సమాచారం. అదే కనుక నిజమైతే... హాలీవుడ్ యవనికపై వెలిగిన దక్షిణాది తారలుగా నయనతార, అనుష్క నిలిచిపోతారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement