అనుష్కకు వెల్‌కమ్.. నయనకు నో..! | Anushka grabbing Nayanthara film | Sakshi
Sakshi News home page

అనుష్కకు వెల్‌కమ్.. నయనకు నో..!

Published Wed, May 18 2016 9:08 PM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM

అనుష్కకు వెల్‌కమ్.. నయనకు నో..!

అనుష్కకు వెల్‌కమ్.. నయనకు నో..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలను హీరోయిన్ ల కొరత తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. నాగ్ లాంటి స్టార్లు ప్రయోగాత్మక చిత్రాలతో ఆకట్టుకుంటుంటే కమర్షియల్ సినిమాలు చేస్తున్న హీరోలు మాత్రం తమ వయసుకు తగ్గ జోడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. నయనతార, అనుష్క లాంటి ఒకరిద్దరు మాత్రం సీనియర్ హీరోలకు సూట్ అవుతుండటంతో వారి మధ్య తీవ్రమైన పోటి నెలకొంది. అనుష్క బాహుబలి సినిమాలతో బిజీగా ఉండటంతో ఇన్నాళ్లు సీనియర్ హీరోల సినిమాలు నయనతార చేతికి వెళుతున్నట్టుగా కనిపించాయి.

బాహుబలి షూటింగ్ చివరి దశకు రావటంతో సౌత్ ఇండస్ట్రీలో సీన్ మారుతున్నట్టుగా కనిపిస్తోంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిరంజీవి 150వ సినిమాలో ముందు నుంచి నయనతార హీరోయిన్ అంటూ ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని అనుష్క పేరును పరిశీలిస్తున్నారట. బాబు బంగారం షూటింగ్ విషయంలో నయన్ సరిగ్గా డేట్స్ ఇవ్వక పోవటం కూడా ఈ మార్పుకు కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బాహుబలితో పాటు సింగం 3, తలా 57 సినిమాల్లో నటిస్తున్న అనుష్క, చిరు సినిమాకు డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement