ప్రేమ ఒక మైకం | anushka in love....? | Sakshi
Sakshi News home page

ప్రేమ ఒక మైకం

Published Wed, Jan 20 2016 1:52 AM | Last Updated on Sun, Sep 3 2017 3:55 PM

ప్రేమ ఒక మైకం

ప్రేమ ఒక మైకం

ప్రేమ అనేది ఒక మైకం. ఇలా అన్నది ఎవరో సాధారణ వ్యక్తి అయితే పెద్దగా పట్టించుకునేవారు కాదేమో. అందాల భామ అనుష్క నోటినుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడంతో చర్చనీయాంశంగా మారింది. అనుష్క ఆషామాషీ నటి కాదు. చిలిపి పాత్రల నుంచి చారిత్రక పాత్రల వరకూ అవలీలగా అభినయించగల సత్తా గలిగిన నటి.అరుంధతి చిత్రానికి ముందు ఆ తరువాత అని సగౌరవంగా చెప్పుకునే సినీ చరిత్ర ఆమెది.
 
 రుద్రమదేవి చిత్రంలో వీరనారిగా అనుష్క నట విజృంభణ విమర్శకులను సైతం మెప్పించింది.అలాంటి నటి వ్యాఖ్యల ప్రభావం సమాజంపై పడుతుందన్నది నిర్విదాంశం. అనుష్క నటిగా దశాబ్దం కాలం పూర్తి చేసుకున్నారు. వయసు పరంగా 34 వసంతాలను టచ్ చేశారు. దీంతో ఇంటిలో ఈ బ్యూటీకి వరుడి వేటను ప్రారంభంచినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల అనుష్క ముందు ప్రేమ,పెళ్లి ప్రస్తావన తీసుకురాగా పెద్ద లెసనే ఇచ్చారు. అదేవిటో చూద్దాం.
 
  ప్రేమ అనేది ఒక మైకం. అది ఒక మాయ కూడా. యుక్త వయసులో చాలా మంది ఆ మాయలో పడిపోతున్నారు. ఆ తరువాత దాన్ని తలచుకుని నవ్వుకుంటారు. ఇక నా విషయానికి వస్తే నాకు ప్రేమ అనుభవం లేదు. ప్రేమించే సమయం లేదు. ప్రస్తుతం విశ్రాంతి లేకుండా నటిస్తున్నాను. నేనిప్పుడు సినిమాను మాత్రమే ప్రేమిస్తున్నాను. ఇక పెళ్లి అంటారా సమయం వచ్చినప్పుడు అది జరుగుతుంది. నాకు కాబోయే భర్త కొన్ని అర్హతలు కలిగి ఉండాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా దాపరికాలు ఉండకూడదు. ఏ విషయంలో అయినా ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలి.
 
 ఇక నాకు నచ్చిన విషయాలు తనకూ నచ్చాలి. అలాంటి వ్యక్తి తారస పడినప్పుడు వెంటనే పెళ్లి చేసుకుంటాను. సినిమా జీవితం గురించి చెప్పాలంటే గత ఏడాది నటించిన చిత్రాలు మంచి విజయాలను అందించాయి. ఈ ఏడాది వైవిధ్యభరిత కథా చిత్రాల్లో నటిస్తున్నాను అని అంటున్న అనుష్క ప్రస్తుతం బాహుబలి-2, ఎస్-3 (సింగం-3) చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement