ఆ దెయ్యం రక్తం తాగుతుంది తెలుసా! | Anushka Sharma Production Bulbbul Trailer Out | Sakshi
Sakshi News home page

భయపెడుతున్న బుల్‌బుల్‌ ట్రైలర్‌!

Published Fri, Jun 19 2020 5:13 PM | Last Updated on Fri, Jun 19 2020 9:45 PM

Anushka Sharma Production Bulbbul Trailer Out - Sakshi

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న అనుష్క శర్మ... నిర్మాతగానూ దూసుకుపోతున్నారు. క్లీన్‌ స్లేట్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌లో ఇప్పటికే ఎన్‌హెచ్‌10, పరీ వంటి సినిమాలను ఆమె నిర్మించారు. అదే విధంగా పాతాళ్‌ లోక్‌ వంటి వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలోనూ సత్తా చాటారు. తాజాగా అనుష్క నిర్మాణ సారథ్యంలో రూపొందిన ‘‘బుల్‌బుల్‌’’నెట్‌ఫ్లిక్స్‌ ఒరిజినల్స్‌లో జూన్‌ 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో.. ‘‘మనం బాల్యంలో విన్న కథలు నిజమైతే ఎలా ఉంటుంది’’ అంటూ అనుష్క.. బుల్‌బుల్‌ అఫీషియల్‌ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.(కించపరిచారు.. అనుష్క శర్మపై ఫిర్యాదు)

ఇక పల్లకిలో తరలివెళ్తున్న చిన్నారి పెళ్లికూతురు బుల్‌బుల్‌ చెప్పే కథతో మొదలైన ట్రైలర్‌... ఆమె జీవితంలో ఎదురైన అనుభవాలు, భయంకరమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగింది. హారర్‌ జానర్‌లో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను భయపెట్టడంతో పాటుగా సామాజిక సందేశం కూడా కలిగి ఉంటుందని దీన్ని బట్టి అర్థమవుతోంది. కాగా అన్విత దత్‌ దర్శకత్వంలో  తెరకెక్కిన ఈ మూవీలో తృప్తి దిమ్రి, అవినాశ్‌ తివారి, రాహుల్‌ బోస్‌, పవోలీ దామ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement