మగాడినైనా మట్టి కరిపిస్తా! | anushka sharma reveals her avatar in sultan movie | Sakshi
Sakshi News home page

మగాడినైనా మట్టి కరిపిస్తా!

Published Sat, Apr 30 2016 1:02 PM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM

మగాడినైనా మట్టి కరిపిస్తా!

మగాడినైనా మట్టి కరిపిస్తా!

ఈ సంవత్సరం ఈద్‌ సందర్భంగా విడుదల కానున్న 'సుల్తాన్' సినిమా మీద అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరో సల్మాన్‌ఖాన్‌తో పోటీగా హీరోయిన్ అనుష్కా శర్మ కూడా కుస్తీ పట్లు పడుతోంది. ఇందుకోసం ఆమె ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్న విషయం తెలిసిందే. పెద్దపెద్ద వస్తాదుల్లాంటి మగాళ్లను సైతం మట్టి కరిపిస్తానంటూ.. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన ఒక ఫొటోను అనుష్కా శర్మ ట్వీట్ చేసింది. 'ఆర్ఫా'ను అందిస్తున్నానంటూ కుస్తీపట్టు ఫొటోను పెట్టింది.

మట్టి గోదాలో కండలు తిరిగిన ఓ మగ వస్తాదును అనుష్కా శర్మ తనదైన పట్టుతో కింద పడేస్తున్నట్లుగా ఈ ఫొటోలో ఉంది. ఇది చూస్తే అనుష్కాశర్మ అసలు సిసలైన రెజ్లింగ్ యోధురాలిలా కనిపిస్తోంది. ఇప్పటివరకు సాధారణంగా సాఫ్ట్ క్యారెక్టర్లతోనే తనలోని నటనా నైపుణ్యాన్ని చూపించిన అనుష్క.. ఈ సినిమాలో మాత్రం తనలో ఉన్న రెండో కోణాన్ని బయటపెట్టిందని విమర్శకులు అంటున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement