
అనుష్క నన్ను క్లీన్ బౌల్డ్ చేసింది
సుల్తాన్ సినిమాలో మహిళా రెజ్లర్‌గా అనుష్కాశర్మ నటనకు ఆ సినిమా దర్శకుడు అలీ అబ్బాస్ జఫర్ ఫిదా అయిపోయాడు. తన రూపంతోను, కచ్చితమైన యాసతోను ఆమె తనను క్లీన్‌బౌల్డ్ చేసిందని అన్నాడు. నిజానికి ఈ సినిమాలో నటించేందుకు అనుష్క ఆరు వారాల పాటు రోజూ గంటల కొద్దీ కఠిన వ్యాయామం చేసింది, రెజ్లింగ్‌లో కూడా శిక్షణ పొందింది.
రెజ్లింగ్ కోసం ఒకరు, మంచి శక్తి కోసం మరొకరు, కండరాలను రిలాక్స్ చేయడానికి ఒక ఫిజియోథెరపిస్ట్.. ఇలా ముగ్గురి వద్ద ఆమె శిక్షణ తీసుకుంది. దీనికితోడు అనుష్క కచ్చితమైన శాకాహారి. దాంతో కండలు పెంచుకోడానికి బాగా ప్రోటీన్లున్న ఆహారం తీసుకోవాల్సి వచ్చింది. ఆరు వారాల్లో ఆమె ఏం చేయగలదన్న అనుమానం తనకు ఉండేదని.. కానీ ఒక్క రోజు కూడా బ్రేక్ తీసుకోకుండా కఠోర శిక్షణ పొంది అద్భుతంగా చేసిందని దర్శకుడు అలా అబ్బాస్ జఫర్ చెప్పాడు. ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరించిన సుల్తాన్ సినిమా ఈ సంవత్సరం ఈద్ సందర్భంగా విడుదల కానుంది.