
యూపీలో సుల్తాన్ హవా
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా వస్తున్న సుల్తాన్ సినిమా షూటింగ్ ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో శరవేగంగా సాగుతోంది.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా వస్తున్న సుల్తాన్ సినిమా షూటింగ్ ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో శరవేగంగా సాగుతోంది. దీనికి సంబంధించిన విషయాలను సినిమా దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అటూ ఇటూ దట్టమైన చెట్ల మధ్య ఉన్న రోడ్డుమీద హీరో సల్మాన్ ఖాన్ ఓ పాతకాలం నాటి నీలి రంగు స్కూటర్ వేసుకుని వెళ్తున్న ఫొటోను జాఫర్ ట్వీట్ చేశాడు. దానికి ''మోర్నా, ముజఫర్‌నగర్, ఉత్తరప్రదేశ్ సుల్తాన్. సింప్లీ బ్యూటిఫుల్'' అని కేప్షన్ పెట్టాడు.
యూపీలో షూటింగుకు ముందు ఈ సినిమాలో మొత్తం తారాగణం అంతా కలిసి ఢిల్లీలో ఓ షెడ్యూలు పూర్తిచేశారు. ఈ సినిమాలో ఢిల్లీలో ఉన్న 360 ఏళ్ల నాటి జమా మసీదు కూడా కనిపిస్తుంది. యష్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇంఉదలో అనుష్కా శర్మ, రణదీప్ హూడా కూడా నటిస్తున్నారు. ఈ సంవత్సరం ఈద్ సందర్భంగా సినిమాను విడుదల చేయాలని తలపెడుతున్నారు. సల్మాన్‌ఖాన్‌కు ఉన్న ఈద్ సెంటిమెంటు ప్రకారం ఇది కూడా బంపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాడు.
Morna, Muzzafarnagar , Uttar Pradesh @SultanTheMovie . Simply Beautiful. pic.twitter.com/HETenNNzOJ
— ali abbas zafar (@aliabbaszafar) 28 April 2016