పంజాబీ పులిబిడ్డ.. పోరుకు సై! | punjabi sherni anushka sharma gets ready for wrestling | Sakshi
Sakshi News home page

పంజాబీ పులిబిడ్డ.. పోరుకు సై!

Published Sat, Mar 12 2016 10:42 AM | Last Updated on Sun, Sep 3 2017 7:35 PM

పంజాబీ పులిబిడ్డ.. పోరుకు సై!

పంజాబీ పులిబిడ్డ.. పోరుకు సై!

రెండు నెలలు.. సినిమా హీరోయిన్ల జీవితంలో చాలా ముఖ్యమైన కాలం ఇది. ఒక్క రోజు కూడా విరామం లేకుండా షూటింగులలో పాల్గొనే టాప్ హీరోయిన్లకైతే ఇది మరీ ముఖ్యం. కానీ, ఒక్క సినిమా కోసం రెండు నెలల పాటు కేవలం శిక్షణలోనే గడిపేయడం సాధ్యమేనా.. తనకు సాధ్యమని చెప్పడమే కాదు, చేసి చూపించింది అనుష్కా శర్మ. రెండు నెలల పాటు కఠోర శిక్షణ తీసుకుని మల్లయుద్ధంలో నైపుణ్యం సంపాదించింది. ఇదంతా సల్మాన్ ఖాన్ సరసన నటించే సుల్తాన్ సినిమా కోసమే.

నిజంగా తనకు ఇంత తక్కువ సమయంలో ఇంత నైపుణ్యం వస్తుందని ఏమాత్రం అనుకోలేదని, చాలా ఆనందంగా ఉందని చెబుతోంది అనుష్క. పంజాబీ పులిబిడ్డ గోదాలోకి దూకిందంటూ ఆమె మల్లయుద్ధం చేస్తున్న ఫొటోను ఫిట్‌నెస్ ట్రైనర్ అలీ అబ్బాస్ జఫర్ ట్వీట్ చేశారు. జఫర్ వద్దే బాలీవుడ్ ప్రముఖుల్లో సల్మాన్ ఖాన్ సహా చాలామంది ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకుంటారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement